Sangareddy: మాకు సార్‌ కావాలి.. టీచర్‌ బదిలీ రద్దు చేయాలంటూ విద్యార్థుల ఆందోళన

Sangareddy: సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం ముక్టపూర్ గ్రామంలో ఓ అరుదైన దృశ్యం నమోదైంది.

Update: 2025-07-24 06:31 GMT

Sangareddy: మాకు సార్‌ కావాలి.. టీచర్‌ బదిలీ రద్దు చేయాలంటూ విద్యార్థుల ఆందోళన

Sangareddy: సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం ముక్టపూర్ గ్రామంలో ఓ అరుదైన దృశ్యం నమోదైంది. అక్కడి ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లనున్న ఉపాధ్యాయుడిని ఆపేందుకు విద్యార్థులు, గ్రామస్తులు రోడ్డెక్కారు. "మా సర్‌నే మాకు కావాలి" అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ముక్టపూర్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు రమేశ్‌ బదిలీపై నాగల్‌గిద్ద మండలం ఇరక్‌పల్లికి వెళ్లనున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు చాలా ఆవేదనకు గురయ్యారు. రమేశ్ సార్‌ బాగా బోధన చేస్తారంటూ, ఆయన బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులతో కలిసి రోడ్డుపై ఆందోళనకు దిగారు.

తాము ఆయన బోధనతో ఎంతో నేర్చుకుంటున్నామని, ఆయన తరగతుల్లో విద్యకు ఆసక్తి పెరిగిందని చిన్న పిల్లలు చెప్పడం గమనార్హం. ఒక మంచి టీచర్ విద్యార్థుల జీవితాలను మార్చగలడు అనే మాటకు ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.

Tags:    

Similar News