యువతిని వెంటాడిన పాము.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. అసలేమైందంటే..?

Snake Bite: పాములు నిజంగా పగ పడతాయా..?

Update: 2022-03-20 15:30 GMT

యువతిని వెంటాడిన పాము.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. అసలేమైందంటే..?

Snake Bite: పాములు నిజంగా పగ పడతాయా..? పగ బట్టిన పాములు ఒక మనిషిని వెతికి.. వెంటాడి కాటేస్తాయా..? అదంతా ఒట్టి మూఢ నమ్మకం అని కొట్టేసినా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు కాటేసింది.. అది కూడా చాలా తక్కువ వ్యవధిలో జరిగింది.. చివరకు ప్రాణం పోయే దాకా వదిలిపెట్టలేదు.

ఈ యువతి పేరు ప్రణాళి ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన రైతు భలేరావు కి ఏకైక సంతానం. ఉన్నత చదువులు చదవాలన్న కలల ప్రపంచంలో బతికేది కానీ ఓ పాము కాటుతో ఈమె జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పాము పగబట్టిందో లేక అనుకోకుండా జరిగిందో కానీ ఏడు నెలల్లో మూడు సార్లు పాము కాటేసింది. రెండు సార్లు వైద్యం తో బతికి బయటపడ్డా, మూడోసారి మాత్రం జీవన పోరాటంలో ఓడిపోయింది.

పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను నిత్యం వెంటాడుతునే వచ్చింది. గతేడాది సెప్టెంబరులో ఇంట్లో నిద్రిస్తుండగా చేతిపై పాము కాటేసింది. కుటుంబీకులు వైద్యం కోసం దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి ఆమెను బతికించుకున్నారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఇంటి ఆవరణలో కూర్చొని ఉండగా పాము మరోసారి కాటేసింది. చికిత్సతో ఈసారి కూడా కోలుకుంది. అప్పటినుంచి తల్లిదండ్రులు ప్రనాళిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. బయటకు ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడేందుకు సిద్ధమయ్యింది. తన కాలేజీ బ్యాగ్‌లో ఉన్న రంగులను తీసుకునేందుకు చేయి పెట్టడంతో పాము కాటేసింది. హుటాహుటిన రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూసింది. ఒక్కగానొక కుమార్తె మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

వరుసగా మూడు సార్లు ఒకే యువతిని పాము కరవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగింది అనుకున్నా రెండుసార్లు పౌర్ణమి రోజున, ఒకసారి అమావాస్య రోజున పాము కాటేయడంపై పాము నిజంగానే పాము పగపడుతుందా అని భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇంట్లోకి పాములు, విషకీటకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News