Rangareddy: చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన

Rangareddy: మత్తు చాక్లెట్ల విక్రయంపై కేసు నమోదు చేసిన పోలీసులు

Update: 2024-01-10 09:41 GMT

Rangareddy: చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన

Rangareddy: చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది. స్కూల్ దగ్గర్లోని పాన్ డబ్బాల వద్ద పిల్లలకు వీటిని కొంటున్నట్లు గుర్తించారు. చాక్లెట్లు తిన్న విద్యార్థులు మత్తులోకి జారుకోవటం పాటు తరగతి గదిలో వింతగా ప్రవర్తిస్తున్నారు. గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాన్ డబ్బాల వద్ద కొన్న చాక్లెట్లు తినడంతోనే వింతగా ప్రవర్తిస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు పాన్ డబ్బాల యజమానులపై టీచర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News