Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు

Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

Update: 2023-12-22 02:36 GMT

Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు

Special Trains: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడటౌన్‌, హైదరాబాద్‌-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి రైళ్ల వివరాలు ఎస్‌సీఆర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Tags:    

Similar News