Telangana: రేపు సీఎంతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం
Telangana: రేవంత్ హైదరాబాద్‌కు వచ్చాక మరింత స్పష్టత వచ్చే అవకాశం
Telangana: రేపు సీఎంతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం
Telangana: తెలంగాణలో మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్నట్టు సమాచారం. ఒక డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు మంత్రులతో ప్రమాణం స్వీకారం జరగనున్నట్టు తెలుస్తోంది. రేపు సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయనుండగా.. భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే స్పీకర్ ఎవరో నిర్ణయించాకే మంత్రివర్గ కూర్పుపై క్లారిటీ రానున్నట్టు సమాచారం.