Raja Singh: నా ప్రాణం పోయినా ఆ రెండు పార్టీల్లోకి వెళ్లను
Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: నా ప్రాణం పోయినా ఆ రెండు పార్టీల్లోకి వెళ్లను
Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లనని చెప్పారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వెళ్లనన్న రాజాసింగ్.. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. ఒకవేళ బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి.. హిందు రాష్ట్రం కోసం పనిచేస్తానన్నారు. టికెట్ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ.. ఇండిపెండెంట్‌గా గానీ, వేరే పార్టీల నుంచి గానీ పోటీ చేసేది లేదని తేల్చిచెప్పారు. ఇక.. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనపైనా చురకలు అంటించారు రాజాసింగ్.
గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని, అందుకే బీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిందన్నారు. దారుసలాం నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు. ఇక.. తన సస్పెన్షన్‌పైన కూడా స్పందించిన రాజాసింగ్.. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని, సరైన సమయం చూసి సస్పెన్షన్ ఎత్తివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.