Ramya Sri: సీనియర్ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి..హత్యాయత్నం చేశారంటూ కామెంట్ !!
Ramya Sri: సీనియర్ నటి రమ్యశ్రీపై దాడి ఘటన కలకలం రేపుతోంది.
Ramya Sri: సీనియర్ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి..హత్యాయత్నం చేశారంటూ కామెంట్ !!
Ramya Sri: సీనియర్ నటి రమ్యశ్రీపై దాడి ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలోని ఎఫ్ సీఐ కాలనీ లేఅవుట్లో హైడ్రా రోడ్ల మార్కింగ్ చేపట్టగా..ఫ్లాట్ యజమానుల సమక్షంలో అధికారులు మార్కింగ్ చేశారు. అయితే ఫ్లాట్ ఓనర్స్ లో ఒకరైన రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ దాన్ని వీడియో తీశారు. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్ యజమాని అయిన శ్రీధర్ అనుచరులు వారితో గొడవకు దిగారు. మా స్థలంలో మేం వీడియో తీసుకుంటే మీకేంటి ప్రాబ్లమ్ అని రమ్యశ్రీ ప్రశ్నించడంతో వారు ఆగ్రహంతో రెచ్చిపోయి వీరిపై దాడికి పాల్పడినట్లు తెలిపారు.
క్రికెట్ బ్యాట్, కత్తితో రమ్యశ్రీతోపాటు ఆమె సోదరుడిపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన భయంతోనే ఆందోళన గురైన బాధితులు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి తమకు రక్షణ కల్పించాలని రమ్యశ్రీ తమ ఫిర్యాదులో పేర్కొంది. గచ్చిబౌలిలాంటి రద్దీ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో పట్టపగలు ఇలా దాడి జరగడం కలకలం రేపుతోంది. రమ్యశ్రీ సోదరుడు ప్రశాంత్ కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. రమ్యశ్రీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.