Swarnalatha Bhavishya Vani: మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి..

Swarnalatha Bhavishya Vani: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Update: 2025-07-14 04:52 GMT

Swarnalatha Bhavishya Vani: మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి.. 

Swarnalatha Bhavishya Vani: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వెల్లడిస్తూ భక్తులకు కీలక సందేశం ఇచ్చారు.

స్వర్ణలత తల్లి ప్రకటనలో — రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించే బాధ్యత తనదే అని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి ప్రభావం ఉంటుందని, అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అలాగే, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని, పాడిపంటలు బాగా పండుతాయని భవిష్య వాణి చెప్పారు. భక్తులు ఎంతో సంతోషంగా పూజలు నిర్వహించారని పేర్కొన్నారు.

ఈ సందర్భంలో తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.."బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు… కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. ఎవరి జీవితంలో వారు అనుభవించాల్సింది కాలం తీరినప్పుడు తప్పదు. నేనెప్పుడూ మీకోసం ఉన్నాను. ఎవరికైనా అపాయం వస్తే, అడ్డుకుంటాను." అని అన్నారు. ఈ ఉత్సవాల్లో స్వర్ణలత తల్లి భవిష్యవాణి భక్తుల్లో ఆసక్తి, భయం కలిగించింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి మరింత పెంచింది.

Tags:    

Similar News