Hyderabad IT Raids: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు.. రూ.3 కోట్లు స్వాధీనం

Hyderabad IT Raids: మరో రెండ్రోజులు సోదాలు కొనసాగుతాయని సమాచారం

Update: 2023-10-21 08:57 GMT

Hyderabad IT Raids: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు.. రూ.3 కోట్లు స్వాధీనం

Hyderabad IT Raids: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ సంస్థపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సంస్థకు చెందిన యజమాని వద్ద 3 కోట్ల రూపాయలు పోలీసులు సీజ్ చేయడంతో అధికారులు సదరు సంస్థపై ఫోకస్ పెట్టారు. అయితే కర్నాటక నుంచి డబ్బులు తరలిస్తున్న ఆ సంస్థ యజమానిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న 3 కోట్ల రూపాయలను ఐటీ శాఖకు అప్పగించారు. దీంతో ఆ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా డెవలపర్స్, ఇతర వ్యాపారాలపై ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత మూడ్రోజుల నుంచే ఐటీ సోదాలు కొనసాగుతున్నా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో రెండ్రోజుల పాటు ఐటీ అధికారులు కొనసాగుతాయని సమాచారం.

Tags:    

Similar News