ప్రధాని మోడీపై సంగారెడ్డి కౌన్సిలర్ విద్వేషపూరిత వ్యాఖ్యలు.. రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని..

Update: 2020-03-22 05:56 GMT

కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిస్తే, సంగారెడ్డిలోని ఓ కౌన్సిలర్ మత అహంకారంతో ఊగిపోయాడు. అహంకారంతో ఊగిపోయిన 34వ వార్డ్ కౌన్సిలర్ షమీ.. జనతా కర్ఫ్యూను పట్టించుకోవద్దని, రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని కారు కూతలు కూశాడు. సీఏఏ చట్టం తీసేయనంతవరకూ మోడీ మాటలను పట్టించుకోవద్దని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ప్రధాని మోడీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కౌన్సిలర్ ను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు విచారణ చేపట్టారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో జనతా కర్ఫ్యూ సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనాను అరికట్టేందుకు ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు.


Full View


Tags:    

Similar News