Armur: ఛైర్పర్సన్ పండిత్ వినీత వైఖరిపై అధికార పార్టీ కౌన్సిలర్ల అసంతృప్తి
Armur: ఆర్మూర్ మున్సిపాలిటీలో ముసలం
Armur: ఆర్మూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఛైర్పర్సన్ పండిత్ వినీత వైఖరిపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. నిధుల కేటాయింపులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. కామారెడ్డి సమీపంలో రహస్య సమావేశం పెట్టిన కౌన్సిలర్లు, ఛైర్‌పర్సన్‌ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.