హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య

Hyderabad: ఈనెల 12న సస్పెన్షన్‌కు గురైన శ్రీవిద్య

Update: 2023-10-17 05:09 GMT

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్ శ్రీవిద్యా ఆత్మహత్య చేసుకుంది. ఈనెల 12న శ్రీవిద్యా సస్పెన్షన్‌‌కు గురయ్యింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది. అయితే మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్టీసీ అధికారుల వేధింపులే కారణం అంటూ బండ్లగూడ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News