Road Accident: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.

Update: 2020-03-16 08:51 GMT
Bus Accident

రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అతి వేగం వలన కొన్నిరోడ్డు ప్రమాదాలు సంభవిస్తే, మద్యం మత్తులో కొన్నిరోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం సంగయ్యపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామం కొంత మంది గ్రామస్థులు ఏడుపాయలలో జరగిని ఓ శుభకార్యానికి డీసీఎం వ్యాన్‌లో బయల్దేరారు. సరిగ్గా అదే సమయానికి మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ను సంగయ్యపేట దగ్గరికి రాగానే ఢీకొట్టింది. దీంతో వ్యాన్ లో ఉన్న ప్రయాణికుల్లో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది గాయాలపాలయ్యారు.

మృతి చెందిన వారంతా మహిళలే కావడంతో వారి కుటుంబసభ్యులు, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆప్రాంత మంతా విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రల్ని వెంటనే స్థానికులు సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం 108లో తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాల గరించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News