కరోనా బాధితుడి ఇంట్లో చోరీ..

నగరంలో ఉన్న దొంగలు ఇండ్లు దోచుకోవడానికి కరొనా వైరస్ సహకరిస్తుందనే చెప్పుకోవచ్చు.

Update: 2020-06-04 13:07 GMT

నగరంలో ఉన్న దొంగలు ఇండ్లు దోచుకోవడానికి కరొనా వైరస్ సహకరిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇటీవలి హైదరాబాద్ నగరంలో ఓ కరోనా బాధితుని ఇంట్లో జరిగిన చోరీ సంఘటనతో అది నిజనమని నిర్ధారన అయ్యింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. దొంగలు ఆయన ఇంటికి కన్నం వేసి ఉన్నదంతా దోచుకెళ్లారు. ఇప్పుడు ఈ చోరీ ఘటనే నగరంలో కలకలం రేపుతుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన పూర్తివివరాల్లోకెళితే అల్వాల్ ప్రగతిశీల కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించి ఆయన్ను ఏప్రిల్ 11న గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత అదికారులు అతని భార్య ఇద్దరు పిల్లలను కూడా క్వారంటైన్‌కు పంపించారు. అప్పటి నుంచి అంటే సుమారుగా 21 రోజుల పాటు ఆ ఇంట్లో ఎవరూ లేక ఇంటికి తాళం వేసి ఉంది. కాగా ఆ కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చి చూసి ఒక్క సారిగా ఖంగు తిన్నారు. వారు వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు పూర్తిగా తెరచి ఉన్నాయి. దీంతో ఆదరాబాదరాగా ఇంటి సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న సామానులన్నీచిందర వందరగా పడేసి ఉన్నాయి. అంతే కాదు బీరువాని బద్దలు కొట్టి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదను దొంగు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో భాధితులు వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News