Road Accident: సంగారెడ్డి జిల్లా 161 హైవేపై రోడ్డుప్రమాదం
* మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, మరో వ్యక్తి మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు
సంగారెడ్డి జిల్లా 161 హైవేపై రోడ్డుప్రమాదం
Road Accident: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్ అఖోల 161వ జాతీయ రహదారిపై బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. చీరాల నుంచి నారాయణఖేడ్ వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఎదురుగా వచ్చిన కారు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, మరో వ్యక్తి ఉన్నారు. పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బస్సు వేగంగా ఢీకొట్టడం వల్ల కారు సుమారు 50 మీటర్ల వరకు వెనక్కివెళ్లింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.