Medchal Accident: వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి
Medchal: వంటేరు ప్రతాప్‌రెడ్డి వాహనం ఢీకొని వ్యక్తి మృతి
Medchal: మేడ్చల్ పీఎస్ పరిధి అత్వేల్లిలో రోడ్డుప్రమాదం
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అత్వేల్లిలో రోడ్డుప్రమాదం జరిగింది. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మేడ్చల్ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింహులుగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.