Revanth Reddy: ఇవాళ ఆదిలాబాద్, ఖానాపూర్‌లో రేవంత్‌రెడ్డి పర్యటన
Revanth Reddy: అనంతరం బహిరంగ సభల్లో రేవంత్ ప్రసంగం
Revanth Reddy: ఇవాళ ఆదిలాబాద్, ఖానాపూర్‌లో రేవంత్‌రెడ్డి పర్యటన
Revanth Reddy: ఇవాళ ఆదిలాబాద్, ఖానాపూర్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మొదట ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు పట్టణానికి చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి MPDO గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆదిలాబాద్‌లోని డైట్ మైదానానికి చేరుకుని ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే ఎన్నికల బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తారు. మరోవైపు ఇవాళ రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డైట్ గ్రౌండ్లోనే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పార్టీ నేతలు. 30వేల మంది జన సమీకరణతో సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.