Telangana CM: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం
Telangana CM: ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ఫైనల్ చేసింది.
Telangana CM: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం
Telangana New CM Revanth Reddy: సస్పెస్‌కు తెరపడింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని సీఎంగా హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 7న ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పారు.
హైకమాండ్ నుంచి ఆదేశాలు రాగానే హుటాహుటిన హస్తిన వెళ్లారు రేవంత్. ఈ నెల 7న ప్రమాణస్వీకారణం ఉన్న నేపథ్యంలో.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియాతో పాటు రాహుల్,ఖర్గే, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి.
మరో వైపు మంత్రి వర్గ కూర్పుపై కూడా హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. 7న ప్రమాణస్వీకారం ఉండటంతో మంత్రివర్గ కూర్పును వేగవంతం చేసే దిశగా ఏఐసీసీ అడుగులు వేస్తోంది. రేపు మంత్రవర్గ ప్రకటన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.