Revanth Reddy: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు
Revanth Reddy: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: టీ కాంగ్రెస్ పదేళ్ల కళ నెరవేరిన క్షణం ఇది. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఒక్క ఛాన్స్ అంటూ హస్తం నేతలు చేసిన కృషి ఫలించిన రోజు ఇది. మెజార్టీ తెలంగాణ ప్రజల ఆమోదంతో అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్.. కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ అగ్రనేతలు ముఖ్య అతిథిలుగా రాగా.. వేలాది మంది తెలంగాణ ప్రజల సమక్షంలో రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళి సై, రేవంత్ రెడ్డి చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. రేవంత్ రెడ్డి అనే నేను అంటూ తెలంగాణ రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా రేవంత్ ప్రమాణం చేసిన క్షణంలో.. సభా ప్రాగణం అంతా.. ఒక్కసారిగా మారుమోగి పోయింది.