Revanth Reddy: అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు
Revanth Reddy: ప్రజావాణి కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారి నియామకం
Revanth Reddy: అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు
Revanth Reddy: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పథకాల అమలులో అధికారులదే కీలక పాత్ర అని, నిస్సహాయులకు అండగా ఉండి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన తొలి సమీక్షా సమావేశంలో సిక్స్ గ్యారంటీస్ అమలు, లబ్ధిదారుల ఎంపికపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టాలన్నారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదని, ప్రతి పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే అన్నారు సీఎం రేవంత్. భూ కబ్జాదారులను వదిలి పెట్టొద్దని, నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. గంజాయి ఎక్కడపడితే అక్కడ దొరుకుతుందని, రాష్ట్రంలో గంజాయి అనే మాట వినిపించకూడదన్నారు. ప్రజావాణి కోసం.. ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమిస్తామన్నారు. పని చేయడానికి ఇబ్బందికరమైన అధికారులు ఎవరైనా ఉంటే సీఎస్, డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.