Revanth Reddy: టెన్త్, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి
Revanth Reddy: ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలి
Revanth Reddy: టెన్త్, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి
Revanth Reddy: త్వరలో జరగనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో విద్యాశాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ఈ మీటింగ్‌లో సీఎం ప్రస్తావించారు. అలాగే.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా ఉండే విధంగా.. సాఫీగా పరీక్షలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందజేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ జూనియర్ కాలేజీలు అవసరం ఉన్నాయో.. వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి.. వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన పాల్గొన్నారు.