Nallamala: పాదచారులకు అటవీ శాఖ ఆంక్షలు

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో అడవుల్లో అదే విధంగా తెలంగాణ లోని నల్లమల, ఆమ్రాబాద్‌, కవ్వాల్‌ అభయారణ్యాలలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి.

Update: 2020-02-15 12:20 GMT

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో అడవుల్లో అదే విధంగా తెలంగాణ లోని నల్లమల, ఆమ్రాబాద్‌, కవ్వాల్‌ అభయారణ్యాలలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో గత నెలలో నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున కార్చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా శాతం వరకు అడవి ప్రాంతం దగ్దం అయ్యి తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. కాగా వరుసగా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండంతో అధికారులు వాటిని నియంత్రించేదుకు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగానే అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే ప్రయాణికులకు అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో కాలిబాటలో ప్రయాణం పై నిషేధం విధించారు. నల్లమలగుండా శ్రీశైలం వెళ్లే భక్తులు సూచనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. అడవిలో నిర్దేశిత ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని వెల్లడించింది. ఒక వేళ ఖచ్చితంగా అడవి మార్గంలోనే ప్రయాణించాలనుకునే వారు మార్గమద్యంలో ఇష్టం వారికి ఇష్టం వచ్చిన ప్రదేశాలలో తీరొద్దని తెలిపారు.

అదే విధంగా కాలినడకన వెళ్లేవారు ఎక్కడ పడితే అక్కడ అడవిలో నిప్పు రాజేయడం, వంటలు చేసుకోవడంపై నిషేధం విధించింది. సరదా కోసం కొన్ని చోట్ల ఆగి సేదతీరే వారు అక్కడే వండుకోవడం, లేదా సిగరెట్‌ పీకలను అక్కడే పడేస్తున్నారని దానితో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పాదాచారుల కోసం ప్రత్యేక విరామ ప్రాంతాల్లో సేద తీరేందుకు అనుమతిచ్చింది. అంతే కాకుండా వారి కోసం ఈ విరామ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక పోతే అటవీ సంరక్షణ దృష్టా ఆమ్రాబాద్‌, కవ్వాల్‌ అభయారణ్యాలు, రక్షిత అటవీప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచుతున్నట్లు అటవీశాఖ పేర్కొంది. అటవీ ప్రాంతాన్ని రక్షించడం అందరి బాధ్యత అని, దానికి అందరూ కృషి చేయాలని కోరారు. రాబోయేది వేసవి కాలం కాబట్టి నిప్పును అటవి ప్రాంతం సమీపంలో కూడా వాడకూడదని, వాహనదారులు, పాదచారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారుల కోరారు. 

Tags:    

Similar News