మంచివారు మా మాస్టారు.. రిటైర్ అయిన ఉపాధ్యాయునికి అద్భుత సత్కారం!

నేను జీతం తీసుకుంటున్నా. టైముకే వచ్చి టయానికి పోతా అంటే.. ఎవ్వురూ పలకరియ్యరు.. నేను పిల్లలకు పాటాలు సెప్పేటోడినే కాదు.. అందరికి మంచి చేసేటోడిని అని పని సేత్తే ఇట్టనే పెజలు పేనం పెడతరు. ఇన్నారా.. జీతం లెక్క పనికాదు.. జర్రంత మంచి సోచాయించండి మంది మస్తు మోస్తరు అంటున్న ఈ పంతులయ్య ఇసేసాలు ఇనుండ్రి..

Update: 2019-09-26 07:28 GMT

విద్యాబుద్ధులు నేర్పించి భావి తరాలకు బాటలు వేసిన ఆ ఉపాధ్యాయుని పదవీ విరమణ ఘనంగా జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం రేకుల తండా ప్రాథమిక పాఠశాలలో రామా నరేందర్‌ గత రెండేళ్లుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఈ రెండేళ్ల పాటు నిత్యం విద్యార్థులతో ఉంటూ వారిలో చైతన్యం నింపారు. 365 రోజుల్లో 350 రోజులు పిల్లలతోనే గడుపుతూ తండా బాగు కోసం అహర్నిశలు కృషి చేశాడు. ఈ కృతజ్ఞతతో తండా వాసులు ఉపాధ్యాయుని ఘనంగా ఊరేగించారు.

రేకుల తండాలో హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తూ గిరిజనులను చైతన్య పరిచేవిధంగా కర్యక్రమాలు చేపట్టి మంచి పేరు సంపాదించాడు ఉపాధ్యాయుడు. ఆయన పదవీ విరమణ సందర్భంగా తండా వాసులంతా ఏకమై 5 కిలోమీటర్ల మేర ఎడ్లబండిపై ఊరేగింపు జరిపారు. బాధతో నిండిన హృదయాలతో సత్కరించారు. అందరూ ఐకమత్యంతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తండాలోని ఇంటిల్లిపాది బయటకు వచ్చి డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ మాస్టారుకి పదవీ విరమణ చేపట్టారు.

Tags:    

Similar News