MLC Kavitha: భారత జాగృతి సంస్థాగత పదవుల నియామకం.. బలోపేతానికి కృషి చేయాలని కవిత సూచన
MLC Kavitha: భారత జాగృతి ఇటలీ శాఖకు అధ్యక్షుడిగా తానింకి కిశోర్ యాదవ్ నియామకం
MLC Kavitha: భారత జాగృతి సంస్థాగత పదవుల నియామకం.. బలోపేతానికి కృషి చేయాలని కవిత సూచన
MLC Kavitha: భారత జాగృతి సంస్థాగత పదవుల నియామకం జరిగింది. సంస్థాగత పదవులను జాగృతి అధ్యక్షురాలు కవిత కేటాయించారు. జాగృతి బలోపేతానికి కృషి చేయాలని కొత్తగా పదవులు చేపట్టిన వారికి కవిత సూచించారు. ఈ నియమకాలు వెంటనే అమలులోకి వస్తాయని కవిత వెల్లడించారు. రాష్ట్ర కార్యదర్శిగా అనంతుల ప్రశాంత్‌కు బాధ్యతలు ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా LVN రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా పి. శ్రీధర్ రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అప్పాల నరేందర్ యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా చందుపట్ల సుజీత్ రావు, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వీరప్పగారి రమేశ్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా మూల రాము గౌడ్‌ను నియమించారు.
హైదరాబాద్ జిల్లా కోకన్వీనర్‌గా బి. వేణుగోపాల్ రావుకు బాధ్యతలు అప్పగించారు. యువజన విభాగం, రాష్ట్ర కోకన్వీనర్ బొల్లంపల్లి సందీప్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఈ సారి నూతనంగా భారత జాగృతి ఇటలీ శాఖ ఏర్పాటు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేశారు. భారత జాగృతి ఇటలీ శాఖకు అధ్యక్షుడిగా తానింకి కిశోర్ యాదవ్‌ను నియమిస్తున్నట్లు కవిత ప్రకటించారు.