Mahabubabad: పల్లెపల్లెకు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కార్యక్రమంలో రసాభాస

Mahabubabad: ఎవరెన్ని కుట్రలు చేసిన డోర్నకల్‌లో గెలిచేది తానేనన్న ఎమ్మెల్యే

Update: 2023-09-02 14:45 GMT

Mahabubabad: పల్లెపల్లెకు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కార్యక్రమంలో రసాభాస

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం విస్సంపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లెపల్లెకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ కార్యక్రమంలో రసాభాస జరిగింది. గ్రామంలో దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. దీంతో వారిపై ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు, అభిమానులకు మాత్రమే అన్ని పథకాలు ఇస్తామని, వేరే పార్టీ వారికి ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు.. తమది కూడా రాజకీయ పార్టీనే అని.. తమకు ఓటు వేసిన వారికే ప్రాముఖ్యతను ఇస్తామన్నారాయన.. తనను ఓడించడానికి గతంలో పనిచేశారని, ఇప్పుడు పనిచేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా డోర్నకల్ నియోజకవర్గంలో గెలిచేది తానేనని అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News