జుట్టుతో విమానాన్ని లాగడమే నా లక్ష్యం..
సాధారణంగా బస్సును నడపాలంటే డ్రైవర్ ఉండాలి కానీ ఇప్పుడీ అమ్మాయి మాత్రం కేవలం తన జుట్టుతో బస్సును లాగుతుంది. ఎంతో మంది ఎన్నో రకాల సాహసాలు చేస్తారు.
సాధారణంగా బస్సును నడపాలంటే డ్రైవర్ ఉండాలి కానీ ఇప్పుడీ అమ్మాయి మాత్రం కేవలం తన జుట్టుతో బస్సును లాగుతుంది. ఎంతో మంది ఎన్నో రకాల సాహసాలు చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం తన జుట్టుతో ఇలాంటి సాహసాలు ఎన్నో చేసి రికార్డులు సాధించింది. ఎప్పటికైనా విమానాన్ని తన జుట్టుతో లాగాలన్నదే ఆమె కోరిక అని చెప్పకొస్తుంది. అసలెవరీ అమ్మాయి తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాణిరైక్వార్ కు 37 సంవత్సరాలు. ఈమె తన జుట్టుతో ఇప్పటివరకు జీపు, మినీబస్సు,ట్రక్, కంటైనర్, డబుల్‌డెక్కర్ బస్సు, ట్రైన్ ఇంజన్ లాగి అందరితో మెప్పులు పొందింది. తన 16వ ఏటనే కూరగాయల ట్రాలీలో పది నుంచి 25 ఇటుకలను పెట్టుకుని తన జుట్టుతో ఆ లాగడం మొదలు పెట్టింది. అంతే కాదు తన జుట్టుతో చిన్న చిన్న వాహనాలు కాకుండా భారీ వాహనాల కూడా లాగుతూ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంది. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు.