దిశ' కేసు నిందితుడు చెన్నకేశవులు భార్యకు ఆర్థికసాయం చేసిన వర్మ?

దిశ హత్య కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను కలిశారు.

Update: 2020-02-02 12:16 GMT

దిశ హత్య కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను కలిశారు. ఈ సందర్బంగా ఆమె వివరాలను తెలుసుకున్న వర్మ.. ఆమె బ్రతుకుదెరువు కోసం బ్లాంక్ చెక్కు ఇచ్చినట్టు తెలుస్తోంది. 'ఆమె 16 ఏళ్ళ వయసులో అతన్ని(చెన్నకేశవులు) వివాహం చేసుకుంది , ఆమె తన బిడ్డను 17 ఏళ్ళ వయసులో ప్రసవించబోతోంది. దిషా మాత్రమే కాదు, బాస్టర్డ్ తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు..

ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చే బిడ్డ మరియు ఇద్దరికీ భవిష్యత్తు లేదు.' అని పేస్ బుక్ పేజీలో పేర్కొన్నాడు. కాగా దిశ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకొని, ఆ తరువాత కేసు రి కంస్ట్రక్షన్ చేసే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News