Rajasingh: పెద్ద ప్యాకేజీ వస్తే భాజపా నేతలు భారాసతో కలిసిపోతారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Rajasingh: హైదరాబాద్‌లో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో భిన్న స్వరాలు, లోపాల కారణంగా భాజపా నష్టపోయిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Rajasingh: హైదరాబాద్‌లో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో భిన్న స్వరాలు, లోపాల కారణంగా భాజపా నష్టపోయిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"ఆఫ్ ది రికార్డులో కవిత చెప్పిన విషయాలు నిజమే. పెద్ద ప్యాకేజీలు వస్తే మా నేతలు ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కవుతున్నారు. అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా వారు స్వయంగా నిర్ణయించుకుంటున్నారు. ఇది కొత్త విషయం కాదు – ఇదే పరిస్థితి గతంలోనూ జరిగింది. అందుకే భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది" అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ప్రతి ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఇతర పార్టీలతో చేతులు కలుపుతున్నారని, దీని వల్లే పార్టీకి భారీ నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
"భాజపా అధికారంలోకి ఎందుకు రాలేదో లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి భాజపా ఇప్పటికెప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ మా పార్టీకి చెందిన కొంతమంది నేతల వేరే పార్టీలతో కుమ్మక్కు కారణంగా అలా జరగలేదు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందే" అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.