గవర్నర్ నిమ్స్ పర్యటనపై దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రాజ్‌భవన్..
Raj Bhavan: హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతిని గవర్నర్ తమిళిసై పరామర్శించడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాజ్‌భవన్ అధికారులు ఖండించారు
గవర్నర్ నిమ్స్ పర్యటనపై దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రాజ్‌భవన్..
Raj Bhavan: హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతిని గవర్నర్ తమిళిసై పరామర్శించడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రాజ్‌భవన్ అధికారులు ఖండించారు. నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు వాహనంలో పూలమాల ఉండటంపై అసత్య ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై రాజ్‌భవన్ క్లారిటీ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై ఇతర ప్రాంతాల నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన ప్రతీసారి ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే హనుమంతుని గుడిలో సమర్పించేందుకు పూలదండ కారులో ఉంచడం జరిగిందని రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆలయంలో గవర్నర్ ప్రార్థించారని, ఆలయం నుంచి గవర్నర్ తమిళిసై నేరుగా నిమ్స్‌కు వచ్చారని తెలిపింది. గవర్నర్ నిమ్స్ పర్యటనలో ఎలాంటి దురుద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చింది రాజ్‌భవన్.