Rahul Gandhi: ప్రజల తెలంగాణ కోసం పోరాటం చేశాం.. దొరల తెలంగాణ కోసం కాదంటూ ఫైర్‌..

Rahul Gandhi: బీఆర్ఎస్‌, బీజేపీ లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్‌ను అడ్డుకోవడమేనని నిప్పులు

Update: 2023-11-01 07:09 GMT

Rahul Gandhi: ప్రజల తెలంగాణ కోసం పోరాటం చేశాం.. దొరల తెలంగాణ కోసం కాదంటూ ఫైర్‌

Rahul Gandhi: పాలమూరు గడ్డ నుంచి బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాహుల్‌ గాంధీ. కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభలో ప్రసంగించిన రాహుల్‌.. ఈ మూడు పార్టీలు ఒకే తాను ముక్కలంటూ ధ్వజమెత్తారు. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే.. బీఆర్ఎస్‌కు వేసినట్టేనంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల తెలంగాణ కోసం పోరాటం చేశామని, దొరల తెలంగాణ కోసం కాదంటూ రాహుల్‌ మండిపడ్డారు. విపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతాయని, కానీ.. సీఎం కేసీఆర్‌పై ఎలాంటి దాడులు జరగవన్నారు. బీఆర్ఎస్‌, బీజేపీల లక్ష్యం.. తెలంగాణలో కాంగ్రెస్‌ను అడ్డుకోవడమేనని నిప్పులు చెరిగారు రాహుల్‌ గాంధీ.

Tags:    

Similar News