హైదరాబాద్ బాచుపల్లిలో కొండచిలువ కలకలం

హైదరాబాద్ బాచుపల్లిలో కొండచిలువ కలకలం సృష్టించింది. రెడ్డి ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌ 2వ అంతస్తులో కొండచిలువ దర్శనమిచ్చింది.

Update: 2025-10-10 09:28 GMT

హైదరాబాద్ బాచుపల్లిలో కొండచిలువ కలకలం సృష్టించింది. రెడ్డి ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌ 2వ అంతస్తులో కొండచిలువ దర్శనమిచ్చింది. ఇది గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించగా... వారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని భారీ కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం చిలువను సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ కొండచిలువ అపార్ట్‌మెంట్‌ 2వ అంతస్తుకు ఎలా చేరిందనే విషయంపై స్థానికులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News