Republic Day: పిల్లలకు సెలవు ఇచ్చి ఒక్కడే జెండా ఎగరవేసిన ప్రిన్సిపాల్

జెండా పండగ అంటే చాలు దేశ వ్యాప్తంగా ఒక రోజు ముందునుంచే హడావుడి మొదలవుతుంది. పిల్లలంతా జెండా పండగ రోజున ఏయే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలో, జెండా ఆవిష్కరించిన తరువాత ఏయే మిఠాయిలు ఇస్తారో అని ఎదురు చూస్తారు.

Update: 2020-01-26 11:30 GMT

జెండా పండగ అంటే చాలు దేశ వ్యాప్తంగా ఒక రోజు ముందునుంచే హడావుడి మొదలవుతుంది. పిల్లలంతా జెండా పండగ రోజున ఏయే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలో, జెండా ఆవిష్కరించిన తరువాత ఏయే మిఠాయిలు ఇస్తారో అని ఎదురు చూస్తారు. దేశ ప్రథమ పౌరుడు సైతం జెండా ఎగురవేసి నమస్కరిస్తారు. కానీ కాలం మారిన కొద్దీ సంసృతులు మారుతున్నాయి. గణతంత్రదినోత్సవం రోజున పాఠశాలలకు సెలవులను ఇచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే నేపథ్యంలో మేడ్చల్‌లో కూడా ఓ పాఠశాల యాజమాన్యం పాఠశాలకు గణతంత్ర దినోత్సవం రోజున సెలవు ప్రకటించారు. ఇక ఎప్పుడెప్పుడు జెండా పండగ వస్తుందా, జెండా ఎగరేస్తే చూద్దామా అని ఎంతో ఆశతో ఎదురు చేస్తున్న విధ్యార్థుల ఆశ నీరుగారిపోయింది.

పూర్తివివరాల్లోకెళ్తే మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామంలో హైటెక్ వ్యాలీ అనే ప్రైవేటు పాఠశాల తమ ఇష్టారీతిన వ్యవహరిస్తుంది. ఆదివారం గణతంత్ర వేడుకలకు విద్యార్థులు రాకుండా స్కూలుకు సెలవు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం పై మండిపడుతున్నారు. దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే వేడుకలను పిల్లల నుంచి దూరం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలకు రిపబ్లిక్‌ డే వంటివి ఎంతగానో తోడ్పడుతాయని అభిప్రాయపడ్డారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని, పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపోతే విద్యార్థులు ఎవరూ రాని పాఠశాలకు ప్రిన్సిపాల్ మాత్రం వచ్చి విద్యార్థులు లేకుండానే జాతీయ జెండాను ఎగురవేశారు.  

Tags:    

Similar News