Adilabad: 18 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునీకరణ.. రేపు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Adilabad: విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఏసీ గదుల నిర్మాణం
Adilabad: 18 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునీకరణ.. రేపు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల కోసం ఆధునీకరణ హంగులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 18 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టనుంది. ఇందులో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నిధులతో ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్ నిర్మాణంతో పాటు విశాలమైన వెయిటింగ్ హాల్స్, దూరప్రాంత ప్రయాణికులు సేద తీరేందుకు ప్రత్యేకమైన గదులు, ఏసీ సౌకర్యం ఉన్న గదులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఫిట్ లైన్ పనులు సాగుతుండటంతో త్వరలోనే ఆదిలాబాద్‌కు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.