PM Modi: రేపు మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన
PM Modi: మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
PM Modi: రేపు మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన
PM Modi: ప్రధాని మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు రాష్ట్రానికి చేరుకోనున్న ప్రధాని.. మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. ప్రధాని మోడీ షెడ్యూల్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు విడుదల చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ చేరుకోనున్నారు. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభా వేదికగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.