ఏసీబీ కస్టడీలో రాష్ట్ర లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాష్ట్ర లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డిని ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

Update: 2019-10-14 06:28 GMT

 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాష్ట్ర లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డిని ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో మధుసూదన్‌ రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు మధుసూదన్‌ రెడ్డిని విచారించనున్నారు.

అక్టోబర్ మొదటి వారంలో మధుసూదన్‌రెడ్డిని ఆయనతో పాటు, ఆయన ఆస్తులకు బినామీలుగా అనుమానిస్తున్న ఆయన బంధువుల ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు రూ.3 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అధికారులకు సేకరించిన ప్రాధమిక ఆధారాలతో లెక్కకు మించిన ఆస్తులు ఆయనకు వున్నాయని భావించిన అధికారులు మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేసారు. అనంతరం ఆయనని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనకు 19వ తేదీ వరకు రిమాండ్ విధించిన కోర్ట్ ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఉతర్వులు జారి చేసింది.

Tags:    

Similar News