దాదాజీ సేవలు చిరస్మరణీయం: రామ్‌నాథ్‌కోవింద్‌

కొద్ది రోజుల కిందటే శీతాకల విడిదిని ముగించుకుని ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మళ్లీ రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన సంగతి తెలిసిందే.

Update: 2020-02-02 08:03 GMT

కొద్ది రోజుల కిందటే శీతాకల విడిదిని ముగించుకుని ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మళ్లీ రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్ కు నిన్న సాయంత్రం చేరుకుని బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన సంగతి తెలిసిందే.

కాగా పర్యటనలో భాగంగా ఈ రాష్ట్రపతి దంపతులు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శాంతివనంలో నిర్మించిన అతిపెద్ద ధ్యానకేంద్రంను సందర్శించి రామచంద్రమిషన్‌ 75వ వసంతోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ శాంతి వనంలోని లక్షల మొక్కలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు చిరస్మరణీయం అని తెలిపారు. రామచంద్ర మిషన్‌ స్థాపించి 75వ వసంతోత్సాలు పూర్తయ్యాయిని ఆయన అన్నారు. ఈ వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 75 వసంతాలలో రామచంద్ర మిషన్‌కు 150 దేశాల్లో కేంద్రాలు నెలకొల్పాయని తెలిపారు. ఈ ధ్యాన కేంద్రాల్లో లక్షల మంది యోగని అభ్యసిస్తున్నారని, వేలల్లో అభ్యసీలు కూడా ఉన్నారని తెలిపారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.


Full View


Tags:    

Similar News