27వ రోజు కొననసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

♦ ఇవాళ అన్ని డిపోల వద్ద 24 గంటల దీక్ష ♦ పలువురు జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్

Update: 2019-10-31 04:17 GMT

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 27వ రోజు కొనసాగుతోంది. ఇవాళ అన్ని డిపోల దగ్గర 24 గంటల దీక్ష చేపట్టనున్నారు. నిన్న సకలజనుల సమరభేరిలో జేఏసీ నేతల పిలుపు మేరకు దీక్షకు దిగనున్నారు. ఇటు ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతికి నిరసనగా ఇవాళ కరీంనగర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా పలువురు ఆర్టీసీ జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌కు చేరుకున్న బాబు మృతదేహంతో బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేయడానికి కార్మిక సంఘాలు ప్రయత్నం చేశాయి. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌, డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్‌లను నడిపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు దీక్షను ఆర్టీసీ జేఏసీ నాయకులు, అఖిలపక్ష నేతలు విరమింపజేయనున్నాయి. అయితే ఆర్టీసీ విలీనంపై కేసీఆర్‌ తీరుకు నిరసనగా ఐదు రోజులుగా కూనంనేని సాంబశివరావు ఆమరణ దీక్ష చేస్తున్నారు.



Tags:    

Similar News