Prabhakar Rao: తెలంగాణాలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం

Prabhakar Rao:వర్షాల కారణంగా ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని వెల్లడి

Update: 2021-09-07 12:00 GMT

సీఎండీ ప్రభాకర్ రావు (ఫోటో ది హన్స్ ఇండియా )

Prabhakar Rao: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ విపత్తును ముందుగానే ఊహించి బొగ్గును నిల్వ చేయడంతో నిరంతరాయంగా విద్యుత్‌ అందించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ బదులిచ్చామని తెలిపారు. అంతేకాక విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పవర్‌గ్రిడ్‌ నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ఇక శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్‌లో అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. కాగా వర్షాల కారణంగా తలెత్తె విద్యుత్ సమస్యలకు  7382072104 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

Tags:    

Similar News