తెలంగాణ తుది విడత పంచాయితే ఎన్నికల ఫలితాలు

Update: 2019-01-31 01:59 GMT

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికలు నిన్న(30/01/2018)టితో ముగిశాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ముగిసాయి. చాలా ప్రాంతాల్లో ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుది దశలో 88.03శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.99శాతం, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 77.70శాతం పోలింగ్‌ నమోదైంది.

పోలింగ్ అనంతరం ప్రకటించిన ఫలితాల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఏకగ్రీవాలతో కలిపి టీఆర్‌ఎస్ మద్దతుదారులు సుమారు 2505 గ్రామాలను కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారులు 954 పంచాయతీలలో గెలుపొందారు. ఇక బీజేపీ 59 గ్రామాలను దక్కించుకుంది. టీడీపీ కేవలం 13 స్థానాలే దక్కించుకుంది. స్వతంత్రులు 509 పంచాయతీల్లో గెలుపొందారు 

Similar News