పోలీసులకు బిగ్ షాక్.. లాఠీతో ఉడాయించారు

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2020-03-30 15:12 GMT

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రజలు కూడా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. నిత్యవసర వస్తువులు, మెడికల్ షాపులు తప్ప మరేమి తెరిచి ఉండకూడదని, ప్రజల అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. వీటితోపాటు సామాజిక దూరం కూడా పాటించాలని కోరాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతగా చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గుంపులు గుంపులుగా బయటకు రావడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని చోట్లల్లో లాఠీ ఝులిపిస్తున్నారు. కారణం లేకుండా బైకులపై బయటకు వచ్చారంటే కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అందులో భాగంగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. అవసరం లేకుండా బయటికి వచ్చిన ఇద్దరు యువకులను ఓ పోలీస్ అధికారి ఆపి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి ని లాఠీతో కొట్టబోయాడు. రెండు దెబ్బలు వేయగానే లాఠీ బైక్లో చిక్కుకుపోయింది. ఇక ముందున్న డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా వేగంగా వెళ్ళసాగాడు.. కానిస్టేబుల్ ఆ లాఠీని తీసుకునే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. వారి వెంటపడి లాక్కునే ప్రయత్నం చేశాడు. అయినా వీలు పడలేదు. వాళ్లు కూడా లాఠీని తిరిగి ఇవ్వకుండా పారిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.



Tags:    

Similar News