Hyderabad: గన్‌పార్క్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. అమవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్న రేవంత్‌రెడ్డి
Hyderabad: అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్
Hyderabad: గన్‌పార్క్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. అమవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్న రేవంత్‌రెడ్డి
Hyderabad: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా, ప్రలోభాలకు గురిచేయకుండా ఓట్లు అడుగుదామంటూ సీఎం కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అయితే ఇందులో భాగంగానే అమరవీరులస్థాపం వద్ద ప్రమాణం చేద్దాం రావాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అరెస్టు చేయాలా వద్ద అనే మీమాంసలో పోలీసులు ఉన్నారు. అరెస్టు తర్వాత జరిగే పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు పోలీసులు.