తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది : హోం మంత్రి మహమూద్ అలీ

Update: 2020-10-21 07:15 GMT

పోలీస్‌ అమవీరుల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో బుధవారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మంత్రితో పాటు ఉన్నతాధికారులు పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ సమాజ భద్రత, ఉజ్వల భవిష్యత్‌ కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, ఇంకా చేస్తున్నారన్నారు ఆయన అన్నారు.

విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అసువులుబాసిన అమర పోలీస్‌, జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రంలో పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి ఈ సమాజం రుణపడి ఉందన్నారు. కరోనా సమయంలో పోలీసులు వారి కుటుంబాలను సైతం వదిలేసి సమాజం కోసం పాటుపడ్డారని, వారి సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు.

అంతకు ముందు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్‌ శాఖకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పోలీస్‌ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించే దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలతో సత్ఫలితాలిస్తున్నాయన్నారు. పోలీసులకు సహయసహకారాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ కి, హోం మంత్రి మహమూద్‌ అలీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News