DK Aruna: డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
DK Aruna: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ యత్నం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
DK Aruna: డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
DK Aruna: డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దిల్లీకి చెందిన అక్రమ్ గా గుర్తించారు. నిందితుడు హైదరాబాద్ పాతబస్తీ, దిల్లీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. డీకే అరుణ ఇంట్లోకి నిందితుడు ఎందుకు ప్రవేశించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మార్చి 16న తెల్లవారుజామున 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56 లోని డీకే అరుణ ఇంట్లోకి నిందితుడు ప్రవేశించారు.ముఖానికి వేసుకొని ఇల్లంతా తిరిగారు. ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లను కత్తిరించారు. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు సీసీకెమెరా వైర్లు కత్తిరించడం వరకు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ డీకే అరుణ ఇంట్లో లేరు. ఆమె కూతురు మాత్రమే ఉన్నారు. అరుణ మహబూబ్ నగర్ లో ఉన్నారు. ఉదయాన్నే నిద్రలేచని చూసిన ఎంపీ కూతురికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడం చూసి అనుమానం వచ్చింది.సీసీ కెమెరాలను పరిశీలిస్తే దుండగుడు వచ్చిన విషయం తేలింది.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణకు ఫోన్ చేశారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సీపీ ఆనంద్ తో పాటు వెస్ట్ జోన్ పోలీసులు డీకే అరుణ ఇంటిని సోమవారం పరిశీలించారు.