Reventh Reddy: గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

Reventh Reddy: ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమతి లేదన్న పోలీసులు

Update: 2023-10-17 08:19 GMT

Reventh Reddy: గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

Reventh Reddy: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా, ప్రలోభాలకు గురిచేయకుండా ఓట్లు అడుగుదామంటూ సీఎం కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అయితే ఇందులో భాగంగానే అమరవీరులస్థాపం వద్ద ప్రమాణం చేద్దాం రావాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అరెస్టు చేయాలా వద్ద అనే మీమాంసలో పోలీసులు ఉన్నారు. అరెస్టు తర్వాత జరిగే పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News