PM -Mann Ki Baat: ‘మన్‌కీ బాత్’లో తెలంగాణ టీచర్ ప్రస్తావన..కారణమిదే..!
PM -Mann Ki Baat: AI వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఈ సాంకేతికతను వినియోగించుకొని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
PM -Mann Ki Baat: ‘మన్‌కీ బాత్’లో తెలంగాణ టీచర్ ప్రస్తావన..కారణమిదే..!
PM -Mann Ki Baat: AI వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఈ సాంకేతికతను వినియోగించుకొని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో సాయం చేశారన్నారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారని మోడీ అన్నారు. అంతరిక్షం, ఏఐ భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని మోడీ తెలిపారు.