South Central Railways: మళ్లీ పెరిగిన రైల్వే ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలు

South Central Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను మరో సారి పెంచారు.

Update: 2021-04-13 01:51 GMT

South Central Railways:(File Photo)

South Central Railways: కరోనా సెకండ్ వేవ్ సైలెంట్ గా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థతో అరకొర జీవితాలు నెట్టుకొస్తున్నారు సగటు భారతీయుడు. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీలు ఆకాశనంటడంతో పాటు రైల్వే ప్లాట్ ఫాం టికెట్ల ధరలను కూడా పెంచుకుంటూ పోతోంది. ఈ భారం అంతా సాధారణ ప్రజలకు పెను భారం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.

కరోనా కేసులు పెరుగుతున్నాయన్ననెపంతో దక్షిణ మధ్య రైల్వే మరోసారి ప్రయాణికులకు షాకిచ్చింది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను రూ. 30 నుంచి రూ. 50కి పెంచుతున్నామని, రైలెక్కే వారు మినహా మిగతా వారెవరూ స్టేషన్ కు రాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్ కు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని, మిగిలిన రైల్వే స్టేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్నీ ఇంకా తీసుకోలేదని ఆయన అన్నారు. పెంచిన చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News