వింత ఘటన.. బోరు నుంచి గులాబి రంగులో వస్తున్న నీరు
Mancherial: ఆశ్చర్యపోతున్న స్ధానికులు,అధికారులు
వింత ఘటన.. బోరు నుంచి గులాబి రంగులో వస్తున్న నీరు
Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో విచిత్రం చోటుచేసుకుంది. చెన్నూరు పట్టణంలో బోరు నుంచి నీరు గులాబి రంగులో వస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ల శ్రీనివాస్ ఇంట్లోని బోరు నీరు ఎన్నడూ లేనట్టుగా గులాబీ రంగులో వస్తుండడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఈ వింతను చూడడానికి స్థానిక ప్రజలు ఎగబడుతున్నారు. దీనికి కారణం ఏంటని విశ్లేషకులు, అధికారులు అంటున్నారు.