హోలీ వేడుకలపై హై కోర్టులో పిటిషన్ దాఖలు.. అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు

విడ్‌ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Update: 2020-03-04 12:36 GMT

కోవిడ్‌ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సిద్దలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ప్రజల ఆరోగ్యం ద‌ష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్ పిటిషన్‌లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు.

కరోనా వైరస్ నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనా ఎదుర్కొనే ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపటి నుంచి హైకోర్టుకు వచ్చే వారందరికి మాస్కులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కక్షి దారులు కోర్టులకు రావద్దని చెప్పాలని న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. 

Tags:    

Similar News