ఓరి మీ పిచ్చి తగలెయ్య..!

తెలంగాణ ప్రజలు సంప్రదాయంగా జరుపకునే బతుకమ్మ పండుగను కొందరూ ఆకతాయిలు అపహాస్యం చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయలను, సంస్కృతిను మంట కలుపుతూ కొంత మంది మందుబాబులు ఏకంగా బీరు సీసాతో బతుకమ్మ ఆడారు.

Update: 2019-09-30 10:17 GMT

తెలంగాణ ప్రజలు సంప్రదాయంగా జరుపకునే బతుకమ్మ పండుగను కొందరూ ఆకతాయిలు అపహాస్యం చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయలను, సంస్కృతిను మంట కలుపుతూ కొంత మంది మందుబాబులు ఏకంగా బీరు సీసాతో బతుకమ్మ ఆడారు. యాదాద్రి జిల్లాలోని పారుపల్లి అనే గ్రామంలో కొందరు పురుషులు బతుకమ్మను ఆడారు. మద్యం సీసాతో వారు బతుకమ్మను ఆడటం ఇప్పుడు వివాదంగా మారింది. మద్యం సీసాతో బతుకమ్మ ఆడటం ఏంటని మహిళలు నిలదీస్తున్నారు. గ్రామ సర్పంచ్ కూడా కలిసి బతుకమ్మను కించపరిచే విధంగా ఆడటాన్ని తప్పుపడుతున్నారు.

అయితే వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా.. వారు మాత్రం తాము బతుకమ్మ ఆడలేదని, పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నామని తెలిపారు. బతుకమ్మ పాటలు పాడలేదని డ్యాన్స్ చేసినట్టుగా తెలిపారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నది. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు విమర్శులు కురిపిస్తున్నారు.

అయితే గతంలో ఇలా కొంతమంది ఆకతాయిలు మధ్యం సీసాలతో బతుకమ్మ ఆడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు బతుకమ్మ పండగ సమయం కావడంతో ఇలాంటివి చర్యల ద్వారా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News