పవన్ తప్పు లేదు నేనే రావాలని కోరా.. సంపత్ వ్యా‌‌ఖ‌్యలతో బాధపడుతున్న: వీహెచ్

పవన్ కళ్యాన్‎ను తానే రావాలని కోరానని స్పష్టం చేశారు. త్వరలో యురేనియంపై మరో సమావేశం ఏర్పాటు చేస్తామని.. ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా మద్దతివ్వాలన్నారు.

Update: 2019-09-18 08:56 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో మరో కొత్తవివాదం చెలరెగింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పవన్ కళ్యాన్ ను ఆహ్వానించడంపై కాంగ్రెస్ లో సినీయర్ నాయకుల వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ సినీయర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ యురేనియం సమావేశానికి పవన్ ను ఆహ్వనించడంపై కొంత అసహనం వ్యక్తం చేశారు. యురేనియం అంశాన్ని తెర పైకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని... ఈ వ్యవహారానికి పవన్ కళ్యాన్  సంబంధం ఏంటని ఆయన కుంతియా సమక్షంలోనే పార్టీ పెద్దలను ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే సంపత్ వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ ఖండించారు. మాజీ ఎంపీ వీహెచ్ స్పంధిస్తూ.. పవన్ కళ్యాన్‎ను తానే రావాలని కోరానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా మద్దతివ్వాలన్నారు. తానే చొరవ తీసుకొని పవన్‌తో సమావేశం ఏర్పాపాటు చేశానన్నారు. సంపత్ వ్యాఖ్యల పట్ల తాను బాధపడుతున్నట్టు తెలిపారు. త్వరలో యురేనియంపై మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వీహెచ్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News